Header Banner

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఉద్యోగాల వయో పరిమితి పెంపు.. ఎవరికి ఎంత లాభం!

  Tue Mar 04, 2025 21:12        Politics

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ అదిరిపోయే వార్త చెప్పింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, వయస్సు మీరిపోతున్న వారికి ఊరట కల్పిస్తూ కూటమి సర్కార్ ఇవాళ కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రెండు కేటగిరీల్లో ఇలా వయో పరిమితిని పెంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న యూనిఫామ్, నాన్-యూనిఫామ్ కేటగిరీ ఉద్యోగాలకు వయో పరిమితుల్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం యూనిఫామ్ ఉద్యోగాలకు ప్రస్తుతం ఉన్న 34 ఏళ్ల వయో పరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు ప్రస్తుతం ఉన్న వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచారు. తద్వారా రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు ప్రయోజనం లభించనుంది.


ఇది కూడా చదవండినామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ!  పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!


అయితే ప్రభుత్వం ఇక్కడ ఓ మెలిక పెట్టింది. ఇప్పటికిప్పుడు భర్తీ చేసే ఉద్యోగాలకు ఈ వయో పరిమితి వర్తించకుండా వాయిదా వేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్లకు ఈ వయో పరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో సెప్టెంబర్ నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ పెంపు వర్తించబోతోంది. మిగతా వారికి మాత్రం ప్రస్తుతం ఉన్న వయో పరిమితి యథాతథంగా ఉండబోతోంది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి విస్మరించింది. అయితే సచివాలయ, వాలంటీర్ ఉద్యోగాలను భారీ ఎత్తున భర్తీ చేసింది. మిగతా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో కూటమి పార్టీలు ఎన్నికల్లో తమకు అధికారమిస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఇచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు ప్రకటన వచ్చిందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం!  రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!



పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!


బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?


రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..


చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..

ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!

రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #todaynews #flashnews #employees #jobs #ap #governament